నటుడు ప్రకాష్‌రాజ్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారని తెలిసిందే. పోటీ అభ్యర్తిగా మంచు విష్ణు కూడా వున్నారు. ఆ తర్వాత జీవితా రాజశేఖర్, హేమ కూడా తామూ పోటీలో వున్నామని ప్రకటించారు. అయితే ముందునుంచి ప్రకటించిన ప్రకాష్‌రాజ్ అంతే ముందుగా తన పేనల్‌ను ఆయన గురువారంనాడు ప్రకటించారు. త్వరలో ఎన్నికల తేదీని ప్రకటించనున్నారు.
ప్రకాష్ రాజ్ సిని'మా' బిడ్డల ప్యానెల్
సిని'మా' బిడ్డలం
మనకోసం మనం
'మా' కోసం మనం
త్వరలో జరగబోయే MAA ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని, 'మా' శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. 'మా' టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నాం.