తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉండబోతోందని 'ఆంధ్రజ్యోతి' తన కథనంలో పేర్కొంది. ''ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. తాజాగా మంచు విష్ణు కూడా ఈసారి 'మా' అధ్యక్ష పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు.
ప్రకాశ్‌రాజ్‌కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. 'మా' ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. విష్ణు కూడా ఈసారి పోటీ చేయబోతున్నారని తెలుపుతూ.., కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు'' అని ఆ వార్తాకథనంలో పేర్కొన్నారు.