Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాష్ రాజ్‌కు కొత్త సమస్య, మా ఎన్నికల్లో పైచేయి ఎవరిదవుతుంది?

ప్రకాష్ రాజ్‌కు కొత్త సమస్య, మా ఎన్నికల్లో పైచేయి ఎవరిదవుతుంది?
, మంగళవారం, 22 జూన్ 2021 (20:42 IST)
మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నికల్లో లోకల్.. నాన్ లోకల్ అంశం తెరపైకి రానుందా. నడిగర్ సంఘంలో చిచ్చురేపిన వివాదమే మా ఎన్నికల్లోను మంట పుట్టించనుందా. త్వరలో జరిగే మా ఎన్నికల్లో ఏం జరుగబోతోంది.
 
సాధారణంగానే తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాల కంటే మా ఎన్నికల్లోనే ఎక్కువ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. వివాదాలు, ఆరోపణలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నిత్యకృత్యం.
 
గత పదేళ్ళ నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెల్లదీశారు తప్ప మా బాగోగులు పట్టించుకోలేదన్నది ఎప్పటి నుంచో వస్తున్న విమర్స. ఇలాంటి సమయంలో త్వరలో జరుగనున్న మా ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.
 
మా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు చిరంజీవి, నాగబాబు సహా మరికొంతమంది హీరోల మద్ధతు ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఇంకేముంది ప్రకాష్ రాజ్ ఏకగ్రీవం కావడం ఖాయమనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా మంచు విష్ణు బరిలోకి దిగారు.
 
తాను పోటీలో ఉన్నానంటూ ప్రకటించారు. ముందుగా జీవితా రాజశేఖర్ తెరపైకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా విష్ణు ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మా ఎన్నికల్లో లోకల్.. నాన్ లోకల్ అన్న అంశం తెరపైకి రాబోతోంది. ప్రకాష్ రాజ్ కర్ణాటక చెందిన వ్యక్తి అని ఆయన్ను మా అధ్యక్షుడిని చేసి మా మీద రుద్దుతారా అన్న వాదన వినిపిస్తోంది.
 
స్థానికులనే మా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొందరు తెరమీదకు తెస్తున్నారు. ఇదే అంశంపై గతంలో నడిగర్ సంఘంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. ఇక తెలుగు వాడికి నడికర్ సంఘం ఎలా అప్పగిస్తారంటూ అప్పట్లో విశాల్‌ను ఒక తమిళ వర్గం టార్గెట్ చేసింది.  
 
తీవ్రంగా వ్యతిరేకించారు. అతన్ని అడ్డుకునేందుకు నానా యాగీ చేశారు. ఇదే వివాదం ఇప్పుడు మా ఎన్నికల్లోను రిపీట్ అవుతుందా అన్న విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మంచు విష్ణు రంగంలోకి దిగడంతో మరోసారి హోరాహోరీ పోరు తప్పదని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ రూటులో అల్లు అర్జున్‌!