అల్లు అర్జున్ విభిన్నమైన కథ, కథనాలతో ముందుకు వెళుతుంటాడు. కథల ఎంపిక విషయంలో ఆయనకు ప్రత్యేక అవగాహన వుంది. అవసరమైతే పంచ్ డైలాగ్ లు కూడా జతచేయడానికి రచయితకు సూచనలు ఇస్తుంటాడరని సన్నిహితులు చెబుతుంటారు. డాన్సర్‌గా, యాక్షన్ సీన్స్ చేసే నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తాజాగా సుకుమార్‌తో చేస్తున్న `పుష్ప` సినిమా గురించి దర్శకుడితో పలుసార్లు కథ, కథనంలో చర్చించుకుని ముందుకు సాగుతున్నాడు. ఇద్దరికీ మంచి అవగాహన వుంది. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్షన్ పార్ట్ కూడా తీయబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ ఓ విభిన్నమైన కథను ఎంచుకున్నాడని తెలిసింది. ఈ కథలో ఆయన గుడ్డివాడిగా నటించబోతున్నాడట. వకీల్ సాబ్ దర్శకుడు వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే కథ బాగా నచ్చిందని త్వరలో సెట్‌పై వెళ్ళనున్నదని సమాచారం. అయితే ఈ సినిమా పేరు ఐకాన్‌గా పెట్టినట్లు తెలిసింది. దానికి కాప్షన్‌గా `కనబడుటలేదు` అనే పెట్టారు. అంటే ఐకాన్ కనబడుటలేదు అనేది సినిమా పేరు. ఇలా గుడ్డివాడిగా రవితేజ `రాజా ది గ్రేట్`లో నటించాడు. అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. మరి ఆయన రూటులో అల్లు అర్జున్ వెళుతున్నాడా!ఒక వేళ గుడివాడిగా అంటే అస్సలు పూర్తిగా కనిపించదా? లేదా మసకమసగా కనిపిస్తుందా! అనే దానికిపై ఇంకా క్లారిటీలేదు. త్వరలో ఐకాన్ గురించి తెలియనుంది.