అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచానాలే వున్నాయి. కరోనా టైంలో షూటింగ్ వాయిదాపడడంతోపాటు ఈ సినిమా టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతోనే స్టయిలిష్ స్టార్ కాస్త సుకుమార్ ఐకాన్ స్టార్‌గా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటించాడు. తాను అలా ఎందుకన్నానో సినిమాచూశాక మీకే తెలుస్తుందని వెల్లడించారు. అయినా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్‌పై కొత్త విషయం బయటపడింది.
ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సుకుమార్ బిన్నంగా ప్లాన్ చేసాడట. తొలి భాగానికి `పుష్ప.. ది రైజర్` ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు రెండో భాగానికి అద్భుతమైన టైటిల్ ఒకటి ఫిక్స్ చేస్తారట. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతోంది. ఇలాంటి కథకు రాజకీయ అంశాలు ముడిపడివుంటాయి కనుక ఇది ఏ మేరకు హాట్ టాపిక్ అవుతుందో చూడాల్సిందే. మొదటి భాగం డిసెంబర్‌లో లేదా 2022 సంక్రాంతికి రిలీజ్ చేసి.. రెండో భాగాన్ని 2023లో విడుదల చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.