ఇటీవలే నటి అమలాపాల్ తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఎత్తైన కొండ ప్రాంతంలో అంచున పిట్టగోడపై ఒకరు నులుచుని వుండగా ఆయన తొడపై అమలాపాల్ కూర్చుని తదేకంగా అతన్నే చూస్తున్న స్టిల్ అది. దీనిపై నెటిజన్లు బాగానే రియాక్ట్ అయ్యారు. దీంతో అమలాపాల్ కొత్త వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆయన తన లవర్ కాదని, సోదరుడు అంటూ చెబుతూ, ప్రేమ లాంటి ప్రేమతో బ్రదర్‌తో వున్నానంటూ సమాధానమిచ్చింది. ఈమె గురించి తెలిసిన ఓ అభిమాని ఇది చైల్డ్ హుడ్ ఫొటోనా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పటికే అమలాపాల్ తమిళ తెలుగు భాషల్లో వచ్చిన మైనా చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత దైవతిరుమగన్ చిత్రంతో పాటు పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఎల్ విజయ్ తో న్రేమలో మునిగి 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ, మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత స్వేచ్ఛాజీవిగా మారి తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ మద్యే ఆడై అనే చిత్రంలో నగ్నంగా నటించి షాకిచ్చింది.