Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియ‌ర్ హీరోయిన్ లైలా.. రీ ఎంట్రీ. ఇంత‌కీ ఏ సినిమాతో..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (12:19 IST)
ఎగిరే పావుర‌మా సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక లైలా. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించ‌డంతో పాటు కుర్ర‌కారు మ‌న‌సుల‌ను ఎంత‌గానో దోచుకుంది ఈ అమ్మ‌డు. ఉగాది, పెళ్లిచేసుకుందాం, పవిత్రప్రేమ త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించి అప్పట్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. 
 
ఇలా ఒక్క తెలుగులోనే కాదండోయ్ తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. 2006 తర్వాత లైలా స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు.
 
ఇటీవ‌ల ఓ ఎంట‌ర్ టైన్మెంట్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ... తెలుగు చిత్రపరిశ్రమ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అంతటితో ఆగని ఈమె తమిళ చిత్రపరిశ్రమకి ఫస్ట్ మార్కులు.. ఆ తర్వాత టాలీవుడ్‌కు మార్కులేస్తానని చెప్పుకొచ్చింది.

ఎందుకంటే తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించానని.. అందరూ తనను ప్రోత్సహించారని పాత రోజులను ఆమె గుర్తుకు తెచ్చుకుంది.అంతే కాదండోయ్.. తాను మళ్లీ టాలీవుడ్, కోలీవుడ్‌లోకి ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. 
 
ప్ర‌స్తుతం త‌ను న‌టించ‌బోయే సినిమాకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే... లైలా రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఏంటి..? ఆ సినిమాలో ఆమె పాత్రేంటి..? ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

పల్లెకు పోదాం ఛలో ఛలో... సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

Twist: బిచ్చగాడితో పారిపోయిన వివాహిత.. ఈ కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

జగన్మోహన్ రెడ్డి హ్యాపీ.. విదేశాలకు వెళ్లే అనుమతి మంజూరు

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments