Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పాట వ‌చ్చేసింది. ఇక సంచ‌ల‌న‌మే..! (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (12:00 IST)
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో ప్ర‌యాణించిన వ‌ర్మ‌కు అక్క‌డి వాతావ‌ర‌ణం చూసి క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే సినిమా తీయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ని గ‌తంలో వ‌ర్మ ప్ర‌క‌టించారు. అయితే.. మూవీ టైటిల్ ప్ర‌క‌టించారు కానీ.. ఇది సినిమాగా రావ‌డం అనుమాన‌మే అనుకున్నారు కొంద‌రు.
 
కానీ.. వ‌ర్మ అన్నంత ప‌ని చేసాడు. ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు రంగం సిద్దం అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా వ‌ర్మ‌ విడుదల చేశారు. ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... అంటూ మొదలైన ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం ఉండటం గమనార్హం. 
 
ఇంత‌కీ ఈ పాట‌లో ఏముందంటే...
మనిషి చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకో గలడు.. కానీ, అహం మీద కొడితే.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట ప్రారంభం మొదలుకుని పూర్తయ్యే వరకు టీడీపీ, వైసీపీ నేతల చిత్రాలే ఉన్నాయి.

ఆ పాత్రలను నిజ జీవిత పాత్రలతో పోల్చడం యాదృచ్ఛికం అని, సత్య హరిశ్చంద్రుడిపై ప్రమాణం చేసి వ‌ర్మ‌ చెప్పడం విశేషం. మ‌రి... ఈ సంచ‌ల‌న‌ చిత్రం రిలీజ్ త‌ర్వాత ఇంకేంత వివాద‌స్ప‌దం అవుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments