కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. టైటిల్ సాంగ్ రిలీజ్

శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:50 IST)
టాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఎప్పడూ వివాదాస్పద మార్గంలోనే వెళ్లే ఆర్జీవీ, ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. 
 
పాట ప్రారంభంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, మాజీ సిఎం చంద్రబాబు, జగన్‌ల మధ్య వాగ్యుద్ధాన్ని చూపిస్తూ పాట మొదలవుతుంది. చంద్రబాబు, జగన్‌ల వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించడం విశేషం. 
 
ఇక ఇవే దృశ్యాలు సినిమాలో ఉంటాయో, ఉండవో తెలియదుగానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ పాట సోషల్ మీడియాలో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పిచ్చినాకు కాదు.. మీకు..