Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారు ఎమ్మెల్యేలు కాదు.. స్కూలు పిల్లలు : వర్మ సెటైర్లు

Advertiesment
Ram Gopal Varma
, మంగళవారం, 18 జూన్ 2019 (13:47 IST)
నవ్యాంధ్ర రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు ఎన్నికైన వారంతా ఎమ్మెల్యేలు కాదనీ, స్కూలు పిల్లల్లా ఉన్నారని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాసనసభ సమావేశాల తీరుపై రాం గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. తాను అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే స్కూలు విద్యార్థులు గుర్తుకొస్తున్నారన్నారు. 
 
"సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం పదేపదే బెల్‌ను మోగిస్తున్నారు. అలా చేయక తప్పదనుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారు" అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ఓ ట్వీట్‌ను పెట్టారు. 
 
కాగా, అసెంబ్లీ సమావేశాలు గత వారంలో ప్రారంభం కాగా, తొలి సమావేశాల్లోనే వాడివేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య ప్రతి క్షణం ఏదో ఓ విషయంలో వాగ్వాదం జరుగుతూనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా అధికారం కోల్పోయి విపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను యువ మంత్రులు దుమ్ముదులిపేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కూల్చేస్తాం : మంగళగిరి ఎమ్మెల్యే