Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది... 2020లో కంగనా కన్ఫర్మ్?

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:34 IST)
విభిన్న కథాంశంతో సినిమాలు చేస్తూ బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్ ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 
 
ప్రస్తుతం కంగనా నితేశ్‌ తివారీ సతీమణి అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పంగా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘పంగా’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే.
 
ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ... ‘అశ్వినీ చెప్తుంటే ఈ కథకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఎలాంటి పరిస్థితులలోనైనా నా ధైర్యం నా కుటుంబమే. నిజ జీవిత కథాంశాలతో సినిమా తీయడంలో అశ్వినీకి మంచి అనుభవం ఉన్నందున ఆమెతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. 
 
ఇక వివాహం గురించి అడగగా వివాహబంధంపై నాకు అంత మంచి అభిప్రాయం లేదు, అయితే అశ్వినీ అయ్యర్‌ తివారీ, ఆమె భర్త నితేశ్‌ తివారీలను చూస్తే నాకు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు కాబోయే భర్త నాకంటే తెలివైనవాడు, టాలెంట్‌ ఉన్నవాడు అయ్యి ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో మాట బయటపెట్టడంతో 2020లో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments