Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ‌వాన్ పైన కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఇంత‌కీ ఏమైంది.?

Advertiesment
జ‌వాన్ పైన కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఇంత‌కీ ఏమైంది.?
, మంగళవారం, 24 డిశెంబరు 2019 (20:01 IST)
అత‌నొక జ‌వాన్. దేశాన్ని కాపాడే జ‌వాన్ పైన కేసు న‌మోదు అయ్యింది. ఇంత‌కీ.. జ‌వాన్ చేసిన త‌ప్పు ఏంటి..? ఇది ఎక్క‌డ జ‌రిగింది..?  వివరాల్లోకి వెళితే... జ‌వాన్ వివాహితపై మోజు పడ్డాడు. దీనితో ఆమె వ‌య‌సులో పెద్ద‌వాడని చెప్పి మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. ప్రేమ అంటూ వెంటపడి నువ్వు లేకపోతే నేను చస్తానంటూ పెళ్లికి బలవంతం చేసాడు జవాన్. 
 
చచ్చేటంత ప్రేమను చూసి ఇంట్లో తెలియకుండా అన్నవరం స్వామి సాక్షిగా తాళి కట్టించుకొని కాపురం కొనసాగించారు. తన కన్నా పెద్దవాడు అన్నయ్య ఇంట్లో ఉన్నాడంటూ, అప్పుడే పిల్లలు వద్దంటూ అబార్షన్ చేయించాడు. ఇంతలో తల్లిదండ్రుల‌ ఒత్తిడితో కాసుల కక్కుర్తితో వేరే వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇది తెలుసుకున్న వివాహిత జావాన్‌ను ఫోన్లో నిలదీసింది.
 
నీవేమైనా తేల్చుకోవలంటే మా అమ్మ దగ్గరకు వెళ్లి తేల్చుకోవాలంటూ ఫోన్ పెట్టేసాడు ఆ జ‌వాన్. తానే సర్వం అని నమ్మి అందరిని కాదనుకొని వచ్చిన ఆమె ఈ పరిణామాలకు షాక్ అయ్యింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విశాఖ ఎయిర్‌పోర్ట్ పరిధి పోలీస్ స్టేషన్లో జవాన్ పైన కేసు న‌మోదు చేసారు. అయిన‌ప్ప‌టికీ... సంతబొమ్మాళి మండలం కాళింగ వీధిలో తన అత్తవారింట న్యాయం కావాలని ఆ వివాహిత పోరాటం చేస్తుంది. మాకు సంబంధం లేదంటూ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది అత్త‌. అయితే.. పోలీసులు కేసు న‌మోదు చేసి ఆమెకు న్యాయం చేస్తామ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుజనా చౌదరికి షాక్, విజయసాయిరెడ్డా మజాకా.. ఏమైంది?