Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైకోర్టుకి దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్, వీడియోతో సహా

Advertiesment
హైకోర్టుకి దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్, వీడియోతో సహా
, మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:43 IST)
గత నెల దిశ హత్యాచారం చేసిన నిందితులు పోలీసు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్ బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. ఆ రిపోర్టును హైకోర్టుకి సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు అందజేసింది. ఈ రిపోర్టుతో పాటు వీడియో సీడిని కూడా అందజేసిన బృందం మరింత సమగ్రమైన రిపోర్టును వారం రోజుల్లో పంపిస్తామని పేర్కొంది. 
 
కాగా ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమీషన్ తాము బస చేసేందుకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలంటూ లేఖను రాసింది. ఇదిలావుంటే రీపోస్టుమార్టం నిర్వహించిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సోమవారం నాడు అప్పగించారు. ఆ రోజే అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడంలేదు: మంగళగిరి పిఎస్‌లో ఫిర్యాదు