Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైవే పక్కన ఒంటరిగా అమ్మాయి 'దిశ' నిందితుల కంటబడితే అంతేసంగతులు... అలా 9 మందిని...

హైవే పక్కన ఒంటరిగా అమ్మాయి 'దిశ' నిందితుల కంటబడితే అంతేసంగతులు... అలా 9 మందిని...
, బుధవారం, 18 డిశెంబరు 2019 (18:46 IST)
దిశ హత్య కేసులో నిందితుల డీఎన్‌ఏతో మిస్టరీ చేధించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎదురు కాల్పుల్లో మరణించిన ఆ నలుగురు చనిపోక ముందు పోలీసుల ఎదుట వెల్లడించిన వివరాలు.. అధికారులను షాక్‌కు గురి చేశాయని చెప్పవచ్చు. వారు చంపింది దిశను మాత్రమే కాదు అలా మరో 9 మందిని హత్య చేసి దహనం చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు.
 
ప్రధాన సూత్రధారి అరిఫ్‌ అలీ 6, చెన్నకేశవులు 3 హత్యలను చేసినట్లు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతాల్లో హైవే రహదారుల వద్ద చేసినట్లు ఒప్పుకున్నట్టు సమాచారం. 
 
ప్రతి ఘటనలో మహిళలపై లైంగిక దాడి, ఆ తర్వాత హత్య, అనంతరం మృతదేహన్ని దహనం చేయడమే వీరి నేర ప్రక్రియగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. నిందితులు వెల్లడించిన వాంగ్మూలం ఆధారంగా సైబరాబాద్‌ పోలీస్ అధికారులు ఆ ప్రాంతాల్లో గాలింపును చేపట్టినట్లు తెలుస్తుంది.
 
అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో అలాంటి సంఘటనలు జరిగినవి మొత్తం 15 వరకు ఉండటంతో పోలీసు అధికారులు వాటన్నింటికి  సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల్లో పోలీసులకు సహకరించే విధంగా ఫలితాలు రాలేదు. దీంతో పోలీసులు శాస్త్రీయంగా పద్ధతుల్లో మరికొన్ని కోణాల్లో నిర్ధారించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
 
విచారణలో భాగంగా హైవేలకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో జరిగిన 15 హత్య కేసుల చిట్టా వివరాలను సేకరిస్తున్నారు. దీని కోసం అరిఫ్‌ అలీ, చెన్నకేశవులు, నవీన్‌, శివల డీఎన్‌ఏలను సేకరించిన పోలీసులు వాటితో హత్యకు గురైన 15 మంది మృతుల డీఎన్‌ఏలతో విశ్లేషించనున్నారు. వాటితో పోలితే సైబరాబాద్‌ పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా చార్జీషీటులో వీటన్నింటిని ఆధారాలతో పొందుపర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. పోలీసులు గుర్తించిన 15 మంది మహిళల హత్య కేసులలో అధికంగా ఇంకా మిస్టరీ వీడలేదని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చెప్పి భర్త తలపై రోకలి బండతో బాది, చేయి కోసుకున్న భార్య