Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజమే సీక్రెట్ పెళ్లి చేసుకున్నా... అది ప్రైవేట్ జీవితం : శ్రియ (Video)

నిజమే సీక్రెట్ పెళ్లి చేసుకున్నా... అది ప్రైవేట్ జీవితం : శ్రియ (Video)
, గురువారం, 26 డిశెంబరు 2019 (10:02 IST)
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రియ ఒకరు. ఈమె ప్రస్తుతం సినీ అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్నారు. అయితే, తనకు వచ్చిన ఒకటి అర చిత్రాలను మిస్ చేసుకోకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ళ క్రితం రహస్యంగా వివాహాన్ని చేసుకున్నారు. వరుడు రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. పైగా వ్యాపారవేత్త. పేరుత అండ్రీ కోశీవ్‌. ఈ సీక్రెట్ వివాహంపై ఇంతవరకు శ్రియ స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. పెళ్లి విషయంలో దాయడానికి ఏమీ లేదని, అయితే తన జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. నటనను కొనసాగిస్తానని, ఈ విషయంలో తన భర్త సహకారం ఉందని పేర్కొంది. తాను బిజీగా ఉంటేనే ఆయన ఆనందిస్తుంటారని తెలిపింది. తన పెళ్లై దాదాపు రెండేళ్లు అవుతున్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని శ్రియ నవ్వుతూ చెప్పింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు ఫోటో షూట్‌లో తొక్కిసలాట..