Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిలేరు నీకెవ్వరు నుంచి టైటిల్ ట్రాక్ వచ్చేసింది..

Advertiesment
సరిలేరు నీకెవ్వరు నుంచి టైటిల్ ట్రాక్ వచ్చేసింది..
, సోమవారం, 23 డిశెంబరు 2019 (17:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు వచ్చేశాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు తన ఎంటైర్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నారు. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలానే టాలీవుడ్ లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన విజయశాంతి ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్‌కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. 
 
తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్‌ని కాసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆర్మీ జవానుల గొప్పతనాన్ని, త్యాగ నిరతిని చాటిచెప్పే విధంగా ఎంతో అత్యద్భుతంగా పాట సాగిందని పలువురు శ్రోతలు ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్‌కు రామ జోగయ్య శాస్త్రి హృద్యమైన సాహిత్యాన్ని అందించగా, దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మంచి ట్యూన్ ని అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
 
ఇక జనవరి 5న ఎంతో వైభవంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకకు ఇప్పటికే చాలావరకు ఏర్పాట్లు మంచి జోష్‌తో జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్వాన్స్ తీసుకుని చెక్కేసిన భామ.. కేసు పెట్టిన చిత్ర యూనిట్