Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆర్ఆర్ఆర్' పేరు అదికాదట... రామ - రౌద్ర - రుషితం

Advertiesment
#RRR Movie TITLE Update
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి అలియా భట్, ఒలివీయాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
మొన్నటివరకు వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జరుపగా, ప్రస్తుతం తాత్కాలికంగా విరామం ఇచ్చారు. జ‌న‌వ‌రి నుండి చిత్ర ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాల‌ని జ‌క్క‌న్న భావిస్తుండ‌గా, సినిమాలోని పాత్ర‌ల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం టైటిల్‌పై వివిధ రకాలుగా ప్రచారం సాగుతోంది. ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు భాష‌ని బ‌ట్టి మారుతుంద‌ని తెలుస్తుంది. తెలుగులో 'రామ రావ‌ణ రాజ్యం' అని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం జ‌ర‌గ‌గా, ఇప్పుడు ఈ టైటిల్ ఆర్ఆర్ఆర్‌కి పెట్టే ఛాన్స్ లేదు. 
 
దీనికి గల కారణం లేకపోలేదు. వి3 ఫిలింస్ అనే సంస్థ రామ రావ‌ణ రాజ్యం అనే టైటిల్‌ని చాంబ‌ర్‌లో రిజిస్ట్రేష‌న్ చేయించుకుంద‌ట‌. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ ఈ టైటిల్‌ను పెట్టే అవకాశం లేకుండా పోయింది. అదేసమయంలో "రామ రౌద్ర రుషితం" అనే పేరుతోను ప్ర‌చారం జ‌రుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య సినిమా దిశ ఎపిసోడ్.. ప్లాన్ చేస్తోన్న బోయపాటి