Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

దేవీ
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (16:40 IST)
Chowrya patam team
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెట్టారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. ఈనెల 25న  థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటీనటులకు ఈరోజు మధ్యాహ్నం ట్రీట్ ఇచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ హోటల్ కు తీసుకెళ్లివారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. టైగర్ ప్రాన్స్, చికెన్ ప్రై, బిర్యానీ, కార్డ్ రైస్.. ఇలా అన్నీ ముందుంచి వారిని తినమని సినిమా గురించి పలు విషయాలు చెప్పారు. సినిమా షూట్ లో  నిజమైనమందు ఇచ్చి కొన్ని సీన్లు చేయించా మీతో. కానీ మీరు కనుక్కోలేకపోయారంటూ సెటైర్లు వేశారు. అలాగే అసలు నన్ను ఎంత టార్చర్ పెట్టారు నిర్మాతగా. నిర్మాత బాధలు నేను అనుభవించా. మరుసటి రోజు షూటింగ్ కు ఏర్పాట్ల గురించి అన్నీ సమకూర్చేసరికి రాత్రి 2 గంటలుఅయ్యేది. మీరు కూడా నన్ను టార్చర్ పెట్టారు. అందుకే ఇకపై ఎలాంటివారితో తీయకూడదో ఈ సినిమా నాకు అనుభవం నేర్పింది అంటూ వారితో సరదాగా మాటామంతీ సాగింది. 
 
ఇక హీరోగా నటించిన ఇంద్ర రామ్ మాట్లాడుతూ,  మాది విజయవాడ. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా వుంటున్నారు.
 
-రాజీవ్ కనకాల గారికి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. ఇందులో ఆయన పాత్ర కూడా స్ట్రాంగ్ గా వుంటుంది. ఆయన కూడా సినిమా ప్రమోషన్స్ లో పార్ట్ కావడం ఆనందంగా వుంది.
 
-నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు.
 
-నేను హీరోగానే కాకుండా కీ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం. మంచి యాక్టర్ అనిపించుకోవడమ నా లక్ష్యం అంటూ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments