Indra Ram, Payal Radhakrishna
త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చూడమణి సహ నిర్మాత. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆడ పిశాచం సాంగ్ వైరల్ అయ్యింది. ఈ రోజు హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా నుంచి 'ఒక్కసారిగా' సాంగ్ లాంచ్ చేశారు.
దావ్‌జాండ్ ఈ సాంగ్ లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి సాంగ్ ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. ఉతుర ఎడిటర్.
సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.
తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్