Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

Advertiesment
Chaurya Patham- Aada pishacham song

దేవీ

, బుధవారం, 19 మార్చి 2025 (17:00 IST)
Chaurya Patham- Aada pishacham song
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.  
 
నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టెర్రిఫయింగ్ నెంబర్ ఆడ పిశాచం సాంగ్ ని రిలీజ్ చేశారు.  
 
దావ్‌జాండ్ ఈ సాంగ్ ఎనర్జిటిక్ వైబ్ అండ్ బీట్స్ తో క్యాచిగా కంపోజ్ చేశారు. ఆంథోనీ దాసన్ సాంగ్ ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ ఫన్ ఫుల్ గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ కాస్ట్ ప్రజెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.  
 
ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు.  హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌. ఉతుర ఎడిటర్.
సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.  
 
తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్