Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

దేవీ
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (15:32 IST)
Kalyanram, vijayasanthi
నందమూరి కళ్యాణ్ రామ్ తీసిన తాజా సినిమా అర్జున్ s/o వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18నే విడుదలైంది. విడుదల తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. పాతచింతకాయ పచ్చడి కథతో యాక్షన్ అంశాలు జోడించి తీశారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాకపోతే విజయశాంతి నటించడం ఆమెకు ప్లస్ గా మారింది. చాలా కాలం మర్చిపోయిన ఆమెను తీసుకువచ్చి కళ్యాణ్ రామ్ తల్లి పాత్ర చేయించారు. రిలీజ్ కుముందు కాకుండా రిలీజ్ తర్వాత విజయశాంతితో ప్రచారం చేయించారు. ఆమె కూడా సినిమా క్రిటిక్స్ పై ఘాటుగా స్పందించింది. వీలుంటే మీరు కథలు రాసి తీసుకురండి అంటూ పేర్కొంది.
 
ఇదిలా వుండగా, ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నామని, సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి. ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది. మండుతున్న వేడి కారణంగా, ప్రేక్షకులు ఎక్కువగా ఇంటి లోపలే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మరీ దారుణంగా వుంది. అక్కడ తీవ్ర వడగాడ్పులు రావడంతో బయటకు జనాలు రావడంలేదు. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే పలు సినిమాలకు థియేటర్ల రాకపోవడంతో వెలవెల బోతున్నాయి.
 
ప్రదీప్ చిలికూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోహైల్ ఖాన్ తో పాటు సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments