Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ముగింపు బాగుండాలి : అల్లరి నరేష్

Allari Naresh, Samyukta, Amrita Iyer, Maruti and others

డీవీ

, బుధవారం, 18 డిశెంబరు 2024 (15:01 IST)
Allari Naresh, Samyukta, Amrita Iyer, Maruti and others
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'.  డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్న ఈ ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది.
 
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ,  ఈ సినిమా ఆల్బమ్ నా కెరియర్ లో గుర్తుండిపోతుంది. బిజీఎం కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరం చాలా సిన్సియర్ గా చేశాం. 24 క్రాఫ్ట్స్ కష్టపడి ఇష్టపడి చేశారు.  డిసెంబర్ 20న ఈ సినిమాని హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. ఒక్కటి మాత్రం చెబుతున్నాను. ఈ క్రిస్మస్ మనదే' అన్నారు.
 
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి కంటెంట్ చాలా ప్రామిస్ గా ఉంది. సినిమా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. రాజేష్ గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎక్సైటెడ్ గా చెప్తుండేవారు. ఆయన కోరుకున్నట్లుగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు
 
డైరెక్టర్ సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ, నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మారుతి గారికి ఈ కథ చెప్పిన తర్వాత నేను ఏదైతే అనుకుంటున్నా అలానే తీస్తా అని చెప్పారు. ఆయన ఆరోజు ఏదైతే చెప్పారో అదే మాట మీద నిలబడ్డారు. సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం దర్శకులకు అదృష్టం. కావేరి పాత్రకు అమృత ఇయర్ న్యాయం చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆమె తప్ప ఆ క్యారెక్టర్ కి మరొక న్యాయం చేయలేరు. బచ్చలమల్లి క్యారెక్టర్ ని కేవలం నరేష్ గారు మాత్రమే చేయగలరు. అది డిసెంబర్ 20న విట్నెస్ చేయబోతున్నాం. ఒక మంచి సక్సెస్ కోసమే మా ఇద్దరం కలిసామని అనిపించింది' అన్నారు
 
హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. డైరెక్టర్ గారు నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నరేష్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అద్భుతమైన యాక్టర్. అన్ని రకాల వేరియేషన్స్ ని చాలా అలవోకగా చేయగలరు. ఆయనతో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది అన్నారు.
 
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ,  డైరెక్టర్ సుబ్బు. సోలో బ్రతుకే సో బెటరు కథని తను చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరికీ ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఈ కథ కూడా నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎంత అద్భుతంగా చెప్పాడో అంత అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. నా ఫస్ట్ సినిమా జర్నీ అల్లరి నరేష్ గారితోనే స్టార్ట్ అయింది. ఆయన ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ లో నేను కలిశాను.  ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే కసిని పెంచింది. ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిధి కోసం వేటతో సాగే కథనమే నాగన్న మూవీ