Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగ‌స్థ‌లం' అంద‌రికీ న‌చ్చుతుంది.. మిస్ అవ్వొద్దు : రామ్ చ‌ర‌ణ్

ప్ర‌ముఖ ఐటీ కంపెనీ వర్చ్యూసా `ది జోష్ 2018-అవ‌ర్ యాన్యువ‌ల్ ఎంప్లాయ్ ఎంగేజ్మేంట్` (జోష్ ఫాంట‌సీ సెస‌న్-4) ప్రొగ్రామ్ ఉద్యోగుల‌ ఆట, పాట‌ల న‌డుమ శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (22:30 IST)
ప్ర‌ముఖ ఐటీ కంపెనీ వర్చ్యూసా `ది జోష్ 2018-అవ‌ర్ యాన్యువ‌ల్ ఎంప్లాయ్ ఎంగేజ్మేంట్` (జోష్ ఫాంట‌సీ సెస‌న్-4) ప్రొగ్రామ్ ఉద్యోగుల‌ ఆట, పాట‌ల న‌డుమ శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగుల‌కు  జ్ఞాపిక‌ల్ని.. ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు.
 
 
అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ, `మీరు చూపిస్తోన్న ఉత్సాహం... మిమ్మ‌ల్ని అంద‌ర్నీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీ అంద‌ర్నీ ఇలా క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ నెల‌లో నాకిది బెస్ట్ డే. ప్ర‌తీ కంపెనీకి ఉద్యోగులే కీల‌కం. వాళ్ల క‌ష్టంతోనే కంపెనీలు పైకొస్తాయి.  ఇక్క‌డ ఉద్యోగులే వర్య్చూస్‌ను ఈ స్థాయిలో నిల‌బెట్టార‌నిపిస్తోంది. వర్చ్యూస్‌లో ప‌నిచేస్తోన్న చాలామంది ఉద్యోగులు ర‌క్త‌దానం చేశారు. చాలా మంచి సేవా కార్య‌క్ర‌మం అది. మేము త‌ల‌పెట్టిన ఆ కార్య‌క్ర‌మానికి ఇంత‌మంది ఎంతో బాధ్య‌త తీసుకుని చేస్తున్నంద‌కు చాలా గ‌ర్వంగా ఉంది. ఇలాగే మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోరుకుంటున్నా.
 
డాన్స్, పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న చాలా బాగుంది. హ‌రిత `రంగ‌మ్మ మంగ‌మ్మ` పాటను ఒరిజిన‌ల్ సింగ‌ర్ క‌న్నా బాగా పాడారు. ఇక రంగ‌స్థ‌లం సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డ్డాను. గుబురు గెడ్డం... మీసంతోనే ఉన్నాను. ఆ రెండు తీసిన త‌ర్వాత హాజ‌రైన తొలి కార్య‌క్ర‌మం ఇది. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేస్తే మీరు ఎప్పుడు పిలిచినా రావ‌డానికి నేను సిద్ధం. రంగ‌స్థ‌లం సినిమా అద్భుతంగా వ‌చ్చింది. ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గ‌త సినిమాలు మిస్ అయినా... ఈ సినిమా మాత్రం త‌ప్ప‌కుండా అంద‌రూ చూడండి. అంద‌రికీ ఖచ్చితంగా న‌చ్చుతుంది` అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చ్యూస్ యాజ‌మ‌న్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments