Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గొల్లభామ' అనేది ఓ పురుగు... మనిషి కాదు : సుకుమార్ (Audio Song)

తన తాజా చిత్రం రంగస్థలంలోని 'గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే' అనే పాటపై వివాదం చెలరేగడంతో ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ స్పందించారు. గొల్లభామ అనేది ఓ పురుగు అని, ఆ పదం మనుషులను ఉద్దేశించినది కాదని వివరణ

'గొల్లభామ' అనేది ఓ పురుగు... మనిషి కాదు : సుకుమార్  (Audio Song)
, గురువారం, 15 మార్చి 2018 (16:58 IST)
తన తాజా చిత్రం రంగస్థలంలోని 'గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే' అనే పాటపై వివాదం చెలరేగడంతో ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ స్పందించారు. గొల్లభామ అనేది ఓ పురుగు అని, ఆ పదం మనుషులను ఉద్దేశించినది కాదని వివరణ ఇచ్చారు. పైగా, గొల్లభామ అనే పురుగు అందరికీ తెలిసే ఉంటుందంటూ స్పష్టంచేశారు. 
 
కాగా, రామ్ చరణ్, సమంత జంటగా నటించిన 'రంగస్థలం' ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పూర్తి గ్రామీణ నేపథ్యంతో కూడిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చారు. ఇందులో 'రంగమ్మ.. మంగమ్మా' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. 
 
అయితే ఈ పాటలో 'గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే' అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సినిమా విడుదలయ్యే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో సుకుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ "రంగస్థలం" కథపై దర్శకుడు సుకుమార్ ఏమన్నారంటే ( Audio Jukebox)