Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెర్రీ "రంగస్థలం" కథపై దర్శకుడు సుకుమార్ ఏమన్నారంటే ( Audio Jukebox)

మెగాపవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోభాగంగా, వచ్చే 18వ తేదీన వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.

Advertiesment
చెర్రీ
, గురువారం, 15 మార్చి 2018 (13:16 IST)
మెగాపవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోభాగంగా, వచ్చే 18వ తేదీన వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, "నేను ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. సినిమాల్లోకి వచ్చేవరకూ పల్లెటూరే నా ఇల్లు. అలాంటి నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా విదేశాల్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను" అని చెప్పాడు. 
 
'నాన్నకు ప్రేమతో' సినిమాను దాదాపు విదేశాల్లోనే తీశాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, 'సార్.. మీరు చాలా బాగా సినిమాలు తీస్తున్నారుగానీ, మన తెలుగు నేటివిటీ నేపథ్యంలో ఎందుకు సినిమాలు చేయడం లేదు? అని అడిగారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసిందన్నారు.
 
ఈ ఒక్కమాట ఫలితంగానే గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ కథ సిద్ధమైంది. పల్లె పట్ల నాకు గల మమకారాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది" అంటూ వివరించాడు. కాగా, ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్న విషయం తెల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో షూట్ అదిరింది.. మీరూ చూడండి