Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య 'సవ్యసాచి' ఫస్ట్ పంచ్ విడుదల

హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం "సవ్యసాచి". చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. "ప్రేమమ్" తర్వాత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుద

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (20:10 IST)
హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం "సవ్యసాచి". చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. "ప్రేమమ్" తర్వాత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్(సివిఎం)లు మాట్లాడుతూ.. "తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని "సవ్యసాచి" అంటారు. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమా, నాగచైతన్య క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది.
 
నాగచైతన్య మాస్ అప్పీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇండియాలో షూటింగ్ ఫినిష్ అయ్యాక అమెరికా వెళ్లనున్నాం. షూటింగ్ పూర్తి చేసి జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. కీరవాణి "బాహుబలి" తర్వాత సంగీతం అందించడంతో పాటు నేపధ్య సంగీతం కూడా సమకూరుస్తున్న చిత్రం సవ్యసాచి కావడం విశేషం" అన్నారు.
 
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి(చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు మొండేటి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments