Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్యారిస్ ప్యారిస్'' గురించి అడిగితే కాజల్ అలా చెప్పేసిందే?

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:11 IST)
''ప్యారిస్ ప్యారిస్'' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా  నటించిన ''క్వీన్'' సినిమాకు రీమేక్.


దక్షిణాదిలో నాలుగు భాషల్లో నలుగురు డిఫరెంట్ హీరోయిన్స్‌తో ''క్వీన్'' సినిమాను రీమేక్ చేసారు. ఇక తెలుగులో ప్యారిస్ ప్యారిస్ సినిమా రీమేక్‌లో కాజల్ అగర్వాల్ నటించింది. అయితే ఈ సినిమా విడుదల గురించి కాజల్ అగర్వాల్‌ను అడిగితే అంటీ అంటకుండా బదులిచ్చిందట. 
 
ఈ సినిమా విడుదల గురించి అడిగితే.. అది తన పని కాదని చెప్పిందట. నటించడం వరకే తన పని అని ఇక దాని విడుదల అంతా యూనిట్ చేయాల్సి వుంటుందని చెప్పుకొచ్చింది. కన్నడ నటుడు రమేష్ అరవింద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావడంతో విడుదల చేద్దామని నిర్మాతలు ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
 
అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. మిగతా మూడు భాషల్లో ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేకున్నా.. తమిళంలో మాత్రం సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఏకంగా 25 కట్స్ చెప్పారు. అడల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో సెన్సార్ వాళ్లు కొంచెం సీరియస్ అయ్యారు. సో సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే  ఈ సినిమా విడుదలకు మార్గం సుగుమం అవుతుందని సినీ యూనిట్ చెప్తోంది. మరి సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు పచ్చజెండా ఊపుతుందో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments