Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమాయకపు రాముడుని ఆటాడుకునే "సీత"

Advertiesment
అమాయకపు రాముడుని ఆటాడుకునే
, శుక్రవారం, 24 మే 2019 (19:54 IST)
చిత్రం : సీత
నటీనటులు : బెల్లంకొండ సాయి, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, తనికెళ్ల భరణి తదితరులు..
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : తేజ 
 
కథ : 
తెలుగు చిత్ర పరిశ్రమలోకి బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడుగా బెల్లంకొడం సాయిశ్రీనివాస్ అడుగుపెట్టాడు. ఈ కుర్రోడు నటించిన చిత్రాల్లో ఇప్పటివరకు బిగ్ హిట్ అయిన చిత్రాలు ఒక్కటీ లేదు. బోయపాటి శ్రీనుతో నటించిన చిత్రం "జయ జానకీ నాయకా" చిత్రం ఫర్వాలేదనిపించింది. 
 
ఆ తర్వాత "కవచం" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇపుడు అగ్ర హీరోయిన్ కాజల్‌తో కలిసి "సీత" టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తేజ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన చిత్రం. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి విశ్లేషిద్ధాం. 
 
సీత (కాజల్ అగర్వాల్) ఒక పొగరుబోతు అమ్మాయి. అనుకోకుండా ఆమె బసవరాజు (సోను సూద్) వల్ల చిక్కుల్లో పడుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల బసవరాజుతో ఒక కాంట్రాక్ట్ సంతకం చేసిన సీత దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో సీత తన చిన్ననాటి స్నేహితుడు రామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)ని కలవడానికి వెళుతుంది. చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న రామ్.. సీతకి సహాయం చేయాలి అనుకుంటాడు. అసలు బసవరాజుతో సీత సంతకం చేసిన కాంట్రాక్ట్ ఏంటి? బసవరాజు బారినుంచి సీతను రామ్ కాపాడతాడా లేదా? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే. 
 
పాత్రల విశ్లేషణ : 
కథ ప్రకారం ఈ సినిమా మొత్తం కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పైగా ఈ సినిమాలో తన పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. చాలెంజింగ్ రోల్ అయినప్పటికీ కాజల్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచింది. ప్రతి సినిమాకి ఎంతోకొంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తున్న బెల్లంకొండ ఈ సినిమాలో కుడా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాడు. వారిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. 
 
సోనూ సూద్ తన పాత్రకు పూర్తిస్తాయలో న్యాయం చేసి పాత్రకు ఊపిరి పోశారు. అభిమన్యు సింగ్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అభినవ్ గోమాటం మంచి కామెడీ టైమింగ్‌తో మెప్పిస్తాడు. మిగతా అందరు నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. 
 
దర్శకుడు తేజ ఈ సినిమా కోసం ఒక మంచి కథను తయారు చేశారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లో కామెడీ, రొమాన్స్, వంటి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్నప్పటికీ, మిగతా కమర్షియల్ సినిమాలకంటే కథ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాక దర్శకుడు ఈ కథను చెప్పే విధానంకూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా సినిమాకు బాగా సెట్ అయ్యింది. పాటల కంటే అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాలో ఉండే ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బాయిగా మారిన అదాశర్మ.. ఔనా?