Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

హీరోయిన్ నడుము విరగ్గొట్టిన దర్శకుడు...

Advertiesment
Kajal Agarwal
, మంగళవారం, 21 మే 2019 (13:24 IST)
దర్శకుడు తేజకు హీరోయిన్ కాజల్ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే ఆమె నడుము విరగ్గొట్టేశాడు. దీంతో ఆమె ఓ రోజంతా నడుముకు బెల్టు ధరించి షూటింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ అగర్వాలే వెల్లడించింది. ఇలా ఎపుడు, ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. 
 
తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం "సీత". ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలపై కాజల్ స్పందించింది. "సీత" సినిమా టైమ్‌లో తేజ తన నడుము విరగ్గొట్టేశాడని వెల్లడించింది. ఒక్కో సమయంలో ఆయన కొట్టుడును తట్టుకోలేక పోయేదాన్ని వాపోయింది. 
 
'తేజ మన నటనను చూడడు. మన కళ్లు చూస్తాడు. అందులో నటన కనిపించాలంటాడు. ఏదైనా చేయండి నాకు మాత్రం కళ్లలో భావాలు కనిపించాలంటాడు. ఒకరోజు నా నడుం విరగ్గొట్టేశాడు. చాలా అలసిపోయాను. ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను.. ఒక దశలో నా కాళ్లపై నేను నిలబడలేకపోయాడు. నా నడుం భాగానికి వేసిన ప్లాస్టర్లతోనే నేను నటించాను. సినిమాలో కూడా ఆ కట్లు కనిపిస్తాయి. ఆ సీన్ ఉంచారో లేక కట్ చేశారో నాకు తెలీదు' అని కాజల్ చెప్పుకొచ్చింది.
 
ఇలా తేజ తనను హింసించిన విషయాన్ని బయటపెట్టింది కాజల్. అయినప్పటికీ అన్నీ భరించానని, ఎందుకంటే "సీత" సినిమాలో పాత్ర అంటే తనకు అంత ఇష్టమని అంటోంది. కాగా, తెలుగు తెరకు కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేసింది దర్శకుడు తేజనే. అలాగే, దర్శకుడుగా తాను విఫలమైనపుడల్లా తేజ... కాజల్‌ వెంటపడుతున్నాడు. అలా వారిద్దరి మధ్య బంధం కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సాహో'' నుంచి డార్లింగ్ చెప్పిన సర్‌ప్రైజ్ వచ్చేసింది..