Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హేష్ మ‌ళ్లీ.. అలా చేశాడా.? ఇంత‌కీ మ‌హేష్‌కి ఏమైంది.? (video)

మ‌హేష్ మ‌ళ్లీ.. అలా చేశాడా.? ఇంత‌కీ మ‌హేష్‌కి ఏమైంది.? (video)
, శుక్రవారం, 17 మే 2019 (12:06 IST)
సూపర్‌స్టార్‌ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ మ‌హ‌ర్షి. ఈ సినిమా అన్ని ఏరియాల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అయితే... ఈ సినిమా విష‌యంలో మ‌హేష్ ఇంత‌కు ముందు ఎన్న‌డూ చేయ‌ని విధంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. అలాగే మ‌హేష్ రియాక్ష‌న్ కూడా చాలా కొత్త‌గా ఉంది. డైరెక్ట‌ర్ వంశీకి మ‌హేష్ ముద్దు పెట్ట‌డం కానీ... స‌క్సస్ మీట్‌లో కాల‌ర్ ఎగ‌రేయం కానీ...ఇదంతా చేస్తుంది మ‌హేషేనా అనిపిస్తుంది. 
 
ఎందుకంటే.. మ‌హేష్ చాలా డిసెంట్‌గా ఉంటాడు. అలాంటిది కాల‌ర్ ఎగ‌రేయ‌డం ఏంటో... డైరెక్ట‌ర్‌కి డైరెక్ట్‌గా ముద్దు పెట్ట‌డం ఏంటో ఇదంతా చూస్తున్న జ‌నాల మ‌దిలో మెదిలే ప్ర‌శ్న ఒక‌టే. మ‌హేష్ ఇన్నాళ్లు బాగానే ఉన్నాడు క‌దా..ఇప్పుడు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు ఏంటి..? అని. మ‌హ‌ర్షి యూనిట్  హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌ను సంద‌ర్శించింది. 
 
ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ మాట్లాడుతూ... సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు వ‌చ్చి చాలా ఏళ్ల‌య్యింది. ఆరోజుల‌ను నేను మ‌రచిపోలేను. మురారి సినిమాను ఇదే థియేట‌ర్‌లో నేను చూసిన‌ప్పుడు నాన్న‌గారు నా భుజం పై చెయ్యి వేశారు. ఆరోజును నేను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఎ.ఎం.బి.సినిమాస్‌లో నేను పార్ట్‌న‌ర్ అయ్యి మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేశాం. నాకు ఆ థియేట‌ర్ ఉన్నా.. ఈ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌నే నా స్వంత థియేట‌ర్‌గా భావిస్తాను. 
 
 
ఎందుకంటే నా కెరీర్ అలాంటి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యాయి. నా 25వ సినిమా మ‌హ‌ర్షి కూడా ఇక్క‌డ రిలీజ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. 
 
దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ థియేట‌ర్‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే నా పై ఉండాలి. నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ అంద‌రి కోసం మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేస్తున్నాను అని అంద‌రి ముందు కాల‌ర్ ఎగ‌రేసి మ‌రోసారి షాక్ ఇచ్చాడు. ఏంటో మ‌హేష్ కి ఏమైందో ఆయ‌న‌కే తెలియాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్ మూవీకి ఆ టైటిల్ పెట్టారా?