Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా చెప్పిన మహేష్ బాబు... టెన్ష‌న్‌లో అనిల్ రావిపూడి... ఏం జ‌రిగింది..?

Advertiesment
అలా చెప్పిన మహేష్ బాబు... టెన్ష‌న్‌లో అనిల్ రావిపూడి... ఏం జ‌రిగింది..?
, గురువారం, 16 మే 2019 (20:43 IST)
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన‌ ప‌టాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సుప్రీమ్, ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్, వెంక‌టేష్ - వ‌రుణ్ తేజ్‌ల‌తో ఎఫ్ 2 చిత్రాలు తెర‌కెక్కించి వ‌రుస విజ‌యాలు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. 
 
ఇలా వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించ‌డంతో అనిల్ రావిపూడి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా చేసే బంపర్ ఆఫ‌ర్ సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఈ మూవీకి స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ టైటిల్ ఖ‌రారు కాక‌పోవ‌చ్చు అనే టాక్ వినిపిస్తుంది. 
 
ఎందుకంటే... మ‌హేష్ బాబుకి టైటిల్ సెంటిమెంట్ వుంది. మురారి, అత‌డు, పోకిరి, ఒక్కడు, దూకుడు .. ఇలా మూడు అక్షరాలతో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. తాజాగా మూడు అక్షరాలతో వచ్చిన మహర్షి సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
అందువలన తదుపరి సినిమా టైటిల్ కూడా మూడు అక్షరాలతో ఉండేలా చూడమని మహేష్‌ బాబు.. అనిల్ రావిపూడితో చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో అనిల్ రావిపూడి మూడ‌క్ష‌రాల టైటిల్ కావాలి. ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంద‌ని తెగ ఆలోచిస్తూ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. మ‌రి... అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడ‌తాడో..? మ‌హేష్‌ని ఎలా చూపిస్తాడో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏంటది?