Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీర్తి సురేష్ మూవీకి ఆ టైటిల్ పెట్టారా?

Advertiesment
కీర్తి సురేష్ మూవీకి ఆ టైటిల్ పెట్టారా?
, శుక్రవారం, 17 మే 2019 (11:39 IST)
కీర్తి సురేష్.. అన‌తికాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన హీరోయిన్. కారణం ఏంటంటే... "మ‌హాన‌టి" సినిమాతో తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసింది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తోంది. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని "118" సినిమాని నిర్మించిన మ‌హేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. ప్ర‌జెంట్ ఐరోపాలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి "స‌ఖి" అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని సమాచారం. 
 
'స‌ఖి' మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సరం లేదు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే... టైటిల్‌కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ను అఫిషియ‌ల్ ఎనౌన్స్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
క‌థ విష‌యానికి వ‌స్తే... స‌మాజంలో మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతున్నాయి. దాంతో అంద‌ర్నీ ఆలోచింపజేసేలా క‌థ ఉంటుంద‌ట‌. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌నుందో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ కోసం పటాస్‌ను వదిలేసిన శ్రీముఖి?