Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోల్డ్‌గా నటించేందుకు భయపడను.. ఎలాగైనా నటిస్తా.. లీకులపై రాధికా ఆప్టే ఫైర్

Advertiesment
Radhika Apte
, గురువారం, 18 జులై 2019 (10:26 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన బోల్డ్ సినిమాల సన్నివేశాలు లీక్ కావడం కొత్తేమీ కాదు. తాజాగా.. రాధికా ఆప్టే నటించిన ''ద వెడ్డింగ్ గెస్ట్'' అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ.. ఈ సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్‌లో రాధికా ఆప్టే, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ నగ్నంగా కనిపిస్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై రాధికా ఆప్టే తీవ్రస్థాయిలో మండిపడింది. సమాజంలో సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫైర్ అయ్యింది. తాజాగా లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్ కూడా నటించాడని.. అతనిని మాత్రం వదిలిపెట్టి.. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ చేశారని, ఇది ఎవరో కావాలని చేసిందేనని వ్యాఖ్యానించింది. 
 
బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని.. నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని రాధికా ఆప్టే ప్రశ్నించింది. అవసరమైతే ఎలాగైనా నటించేందుకు తాను రెడీనని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భవతి అయిన శృతి... అర్జున్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుందా?