ఆసక్తి కలిగిస్తోన్న 'రణరంగం' టీజర్

గురువారం, 4 జులై 2019 (16:01 IST)
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమాకి సంబంధించిన టీజర్ కొంత సేపటి క్రితం రిలీజ్ చేయబడింది. ఇందులో కాజల్.. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. "దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది .. కానీ మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది.
 
ఈ టీజర్‌లో.. శర్వానంద్ మాఫియా డాన్ లుక్‌తోనూ.. మాస్ లుక్‌తోనూ కనిపించనున్నాడు. ఇటు కాజల్‌తోనూ.. అటు కల్యాణి ప్రియదర్శన్‌తోనూ ఆయన జట్టు కట్టిన షాట్స్‌ను చూపించారు. 1990 నేపథ్యంలో సాగే కథగా నిర్మితమైన ఈ సినిమా... ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. కాగా ఈ సినిమా హీరో శర్వానంద్ ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో వున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నయనతార ప్రియుడి దర్శకుకత్వంలో సమంత