Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరా నరసింహారెడ్డి''పై బన్నీ స్పందన.. ఏమన్నారో తెలుసా?

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (15:52 IST)
''సైరా నరసింహారెడ్డి''పై బన్నీ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాపై ఇప్పటివరకు బన్నీ స్పందించలేదని సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ఇటు మెగా అభిమానులతోపాటు అటు స్టైలిష్‌ అభిమానులు కూడా 'సైరా'పై బన్నీ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం ఇన్‌స్టా వేదికగా అల్లు అర్జున్‌ ఈ సినిమాపై తన స్పందనను తెలియచేశారు.
 
"సైరా నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని, మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం. ఇది నిజంగానే తెలుగు చిత్రపరిశ్రమ గర్వంగా చెప్పుకునే విషయం. కొన్ని సంవత్సరాల క్రితం 'మగధీర' సినిమాని చూసినప్పుడు.. చిరంజీవి కూడా అలాంటి సినిమాలో నటిస్తే చూడాలనుకున్నాను. నా కోరిక నేటికి నెరవేరింది. 
 
మెగాస్టార్‌ చిరంజీవితో ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నా బావ రామ్‌చరణ్‌కు అభినందనలు. ఒక తండ్రికి తన కుమారుడు ఇచ్చే గొప్ప బహుమతి ఈ సినిమా. 'సైరా' చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. దర్శకుడు సురేందర్‌రెడ్డిపై గౌరవం మరింత పెరిగింది. ఈ సినిమా ప్రతిఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను.." అని బన్నీ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments