మిల్కీబ్యూటీతో కలిసి ముంబైలో మెగాస్టార్..!

శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:38 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా రీసెంట్‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ముంబై వెళ్ళారు. త‌మ‌న్నాతో క‌లిసి మీడియా అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానమిచ్చారు.
 
అంత‌క‌ముందు చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషించిన అమితాబ్‌తో చిరంజీవి కలిశారు. ఆ స‌మ‌యంలో వారితో పాటు ఫర్హాన్‌ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

Superstar Amitabh Bachchan sir, Megastar Chiranjeevi garu & Farhan Akthar during #SyeRaa promotions in Mumbai. #SyeRaaNarasimhaReddy #SyeRaaOnOct2nd @SrBachchan @FarOutAkhtar @KonidelaPro @excelmovies pic.twitter.com/NWuC6AIn6A

— Konidela Pro Company (@KonidelaPro) September 27, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాధికా ఆప్టే ఫోటోకు సమంత కామెంట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్