ఐశ్వర్యా రాయ్ నో.. ఇల్లీ బ్యూటీ ఓకే.. చిరంజీవి సరసన సూపర్ ఛాన్స్..?

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:10 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆత్రుతగా సైరా కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపున చిరంజీవి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గారు. హెయిర్ స్టైల్ కూడా మారిపోయింది. 
 
ఇందులో సినిమాలో ఆయన హాకీ కోచ్‌గా కనిపించనున్నారని టాక్. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. చిరంజీవి సరసన నటించేందుకు ఐశ్వర్యా రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. సీన్లోకి నడుము సుందరి ఇలియానా వచ్చిందని సమాచారం. 
 
ఇందుకోసం పోకిరి భామ ఇలియానాను కొరటాల సంప్రదించినట్లు తెలుస్తోంది.'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ద్వారా ఆ మధ్య ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ ఇచ్చిన ఇలియానా ఇకపై సినిమాలపై పూర్తి దృష్టి పెడుతుందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాహో చిత్రాన్ని మరోమారు చూడండి... మరింతగా ఎంజాయ్ చేస్తారు : డైరెక్టర్ సుజిత్