మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో తన స్నేహితులకు షేర్ చేశారు.