Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సైరా'కు బెస్ట్ విషెస్ చెప్పిన "తొంగి తొంగి చూడమాకు చందమామ" టీమ్

Advertiesment
Sye Raa
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:01 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక సినిమా "సైరా నరసింహారెడ్డి" గొప్ప విజయం సాధించాలని కోరుకుంటోంది 'తొంగి తొంగి చూడమాకు చందమామ' చిత్ర యూనిట్. సైరాతో తెలుగు సినిమా మరో కొత్త చరిత్రను సృష్టించాలని, ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పదనం తెలియజేయాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతోంది. 
 
గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై "తొంగి తొంగి చూడమాకు చందమామ" చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ సునీత మోహన్ రెడ్డి నిర్మాత. యూత్, ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ కానుమోలు. యువతకు నచ్చే అంశాలతో ఆద్యంతం నవ్విస్తూనే మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. 
 
ఈ చిత్రంలో దిలీప్, శ్రావణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ బాలా, అపర్ణ, కార్తీక్ అయినాల, జెమినీ సురేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ... సైరా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సైరా తెలుగు సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లే చిత్రం కావాలని కోరుకుంటున్నాం. మా సినిమా తొంగితొంగి చూడమాకు చందమామ గురించి చెప్పుకుంటే... ఇదొక ఈతరం ప్రేమకథ. నేటి యువత ఎలా ఉన్నారో చూపిస్తుంది. 
 
ప్రేమంటే తెలియకుండా, అమ్మాయిలతో సరదాగా ఉంటే చాలనుకునే కుర్రాడికి.. నిజమైన ప్రేమంటే ఏంటో తెలియజేస్తుందో అమ్మాయి. అనుకోని మలుపులు తిరిగిన కథలో వీళ్లిద్దరు ఎలా ఒక్కటయ్యారన్నది కథాంశం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంటుంది. మహిళల గొప్పదనం చెప్పేలా సినిమా ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
కుమార్ సాయి, అనంత్, లావణ్య, మహేంద్రనాథ్, మాధవీ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, ఎడిటర్ - ఈశ్వర్ 57, సినిమాటోగ్రఫీ - వివేక్ రఫీ ఎస్కే, సాహిత్యం - బాలాజీ, ఆర్ట్ - రమేష్, కొరియోగ్రఫీ - శ్రీనివాస్, వినయ్, ఫైట్స్ - రియల్ సతీష్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముదురు హీరోల కంటే యంగ్‌స్టర్లే ఇష్టం.. రకుల్ ప్రీత్ సింగ్