Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఫ్యామిలీకి నెగటివ్.. కానీ సత్యజిత్ దూబే తల్లికి పాజిటివ్

Webdunia
సోమవారం, 18 మే 2020 (10:04 IST)
బాలీవుడ్ ప్రముఖులను కరోనా వదిలిపెట్టట్లేదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీని, అతని కుటుంబాన్ని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఉన్న బుధానా గ్రామంలో తన ఇంట్లోనే 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. నవాజుద్దీన్‌కు, అతని కుటుంబ సభ్యులకు అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. వారందరికీ కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. 
 
ట్రావెల్‌ పాస్‌ ద్వారా నటుడు నవాజుద్దీన్‌ మే 15న ఇతర ప్రాంత నుంచి తన ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతనితో పాటు అతని కుటుంబాన్ని మే 25 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. తన ప్రైవేటు వాహనంలో ఇంటికి చేరుకున్న నవాజుద్దీన్‌తోపాటు అతని తల్లి, సోదరుడు, బావ కూడా కలిసి ప్రయాణించారు. తన ప్రయాణంలో భాగంగా 25 చోట్ల తనకు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు.
 
అయితే మరో బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కూడా సోకింది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతోన్న ఆమెకు కరోనా టెస్ట్‌లు నిర్వహించగా పాజిటివ్‌గా తేల్చారు వైద్యులు. దీంతో ఆమెను నానావతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, నిబంధనలకు అనుగుణంగా.. ఆ కుటుంబాన్ని మొత్తం హోంక్వారంటైన్‌లో పెట్టారు అధికారులు.
 
దీనిపై సోషల్ మీడియాలో ఓ పెట్టిన సత్యజిత్ దూబే.. అమ్మకి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో.. నేను, నా సోదరి హోం క్వారంటైన్‌లో ఉన్నాం.. ప్రస్తుతానికి మా ఇద్దరికీ కరోనా లక్షణాలు లేవు.. ఇక, ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న అమ్మతో రోజూ టచ్‌లో ఉన్నాం.. కుదిరితే వీడియో కాల్ లేకపోతే ఫోన్ చేస్తున్నామని.. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని భావిస్తున్నానని.. ఇలాంటి పరిణామం ఊహించలేదని సత్యజిత్ దూబే సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments