చిరంజీవితో కలిసి వెబ్‌సిరీస్ చేయాలనివుంది : రమ్యకృష్ణ (video)

Webdunia
సోమవారం, 18 మే 2020 (09:28 IST)
కేరీర్ తొలినాళ్ళలో ఐరెన్ లెగ్‌గా ముద్రవేయించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చేతిలోపడటంతో ఆమె సూపర్ హీరోయిన్‌గా మారిపోయింది. ఫలితంగా తెలుగులో అగ్రహీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. పైగా, ఆమె సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందరు అగ్రహీరోలతో నటించింది. అయినప్పటికీ ఆమెకు ఆకలి తీరడం లేదట. ఫలితంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలనివుందట. మెగాస్టార్‌తో కలిసి అనేక చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ ఇపుడు మళ్లీ కలిసి నటించడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమె చేయాలనుకుంటుంది తనతో పాటు సినిమాలో కాదు.. వెబ్ సిరీస్‌లో. 
 
అవును 'శివగామి' బాహుబలి తర్వాత జయలలిత జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న "క్వీన్" అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. తమిళంలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్‌కు వచ్చిన క్రేజ్, తన పాత్రకి వచ్చిన గుర్తింపు చూసిన రమ్యకృష్ణ.. మరిన్ని వెబ్‌సిరీస్‌లలో నటించాలని అనుకుంటుందట. కానీ, అది వీలుపడలేదు.
 
ఇపుడు అవకాశం వస్తే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెబ్ సిరీస్ చేయాలని ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 'థియేటర్స్‌లో సినిమా' అనే దానిపై అనుమానాలు నడుస్తున్నాయి. సెలబ్రిటీలంతా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌పైనే దృష్టి పెడుతున్నారు.

అన్నీ బాగోకపోతే సెలబ్రిటీలందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌నే నమ్ముకోవాలి. ఇలా చూస్తే రమ్యకృష్ణ కోరిక నెరవేరడం పెద్ద కష్టం ఏమీ కాదనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఓ దర్శకుడి భార్యగా ఉన్న రమ్యకృష్ణ కోరిక నెరవేరాలని ఆశిద్ధాం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments