Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్‌ను ఐపీఎస్‌గా.. నిహారికను డాక్టర్‌గా చూడాలనుకున్నా... ప్చ్.. నాగబాబు

వరుణ్‌ను ఐపీఎస్‌గా.. నిహారికను డాక్టర్‌గా చూడాలనుకున్నా... ప్చ్.. నాగబాబు
, బుధవారం, 13 మే 2020 (13:49 IST)
మెగా బ్రదర్ నాగబాబు. మెగా మర్రిచెట్టు నీడలో పెరిగినప్పటికీ.. ఇసుమంతైనా గర్వం లేదు. హీరోగా నిలదొక్కుకోలేకపోయినా నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. పైగా, తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేస్తాడు. ఇందులో ఎలాంటి మొహమ్మాటాలకు తావులేదు. తాజాగా ఆయన తన ఇద్దరు పిల్లల భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తన కుమారుడు, యువ హీరో వరుణ్ తేజ్‌ను ఓ ఐపీఎస్ అధికారిగానూ, తన ముద్దుల కుమార్తె నిహారికను వైద్యురాలిగా చూడాలని భావించాను. కానీ, అది జరగలేదని చెప్పుకొచ్చారు. పైగా, తన ఇష్టాన్ని వాళ్లపై బలవంతంగా రుద్ద దలచుకోలేదు. వాళ్లకి ఇష్టమైన మార్గంలో వెళ్లడానికి నా వంతు సహకారాన్ని అందించినట్టు చెప్పారు. 
 
ఇకపోతే వారి పెళ్లిళ్ళపై నాగబాబు స్పందిస్తూ, నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే యేడాది ప్రథమార్థంలో ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువ. ఆ వెంటనే వరుణ్ తేజ్‌కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన వుంది. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రథమార్థంలోగాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన వుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము. పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై వుంది .. ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతాను అని నాగబాబు తన మనసులోని మాటను వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నీ కుదిరితేనే 'ఆచార్య'లో చరణ్‌ నటిస్తాడు : కొరటాల శివ