Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఎపిసోడ్ 32 హైలైట్స్...హాట్ డ్యాన్సులతో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్.. పునర్నవి డ్యాన్సే?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:17 IST)
చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అయ్యిన 'బిగ్ బాస్' మూడో సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారం నుండే కంటెస్టెంట్ల మధ్య తరచుగా గొడవలు జరగడంతో పాటుగా ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒక గొడవ జరుగుతోందని అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేయగా, అందరూ రచ్చ రచ్చ చేశారు.
 
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటిలోని సభ్యులు ఆట పాటలతో ఆనందింపజేయడం కోసం ఆడిషన్స్ ఇవ్వాలని, ఇందుకు శ్రీముఖి, బాబా భాస్కర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తారని అన్నాడు. కాబట్టి ఇంటిలోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ తమ టాలెంట్‌తో జడ్జ్‌లను మెప్పించి, ఆడిషన్స్‌లో సెలక్ట్ అవ్వాలని చెప్పాడు. ఎవరైనా బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్లకు ఫిజ్ బాటిల్ ఇవ్వాలని జడ్జ్‌లకు చెప్పాడు.
 
ఈ ప్రోగ్రాం మొదలయ్యాక మొదట పునర్నవి ‘ఇరగ ఇరగ' పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ అదరగొట్టింది. దీంతో ఫిదా అయ్యిన శ్రీముఖి, మరో జడ్జ్ బాబా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయాలనే ఆశ ఉన్నా, ఇంట్లో వాళ్లు వద్దనడంతో డోర్లు వేసుకుని ఒక్కదాన్నే డ్యాన్స్ చేసే దాన్నని గుర్తు చేసుకున్న అషు రెడ్డి.. తల్లిదండ్రులకు సారీ చెప్పి ‘జిగేల్ రాణి' పాటకు అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె డ్యాన్స్‌కు ఫిజ్ బాటిల్ వచ్చింది.
 
ఈ టాస్క్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది రవి కృష్ణ పర్ఫామెన్స్. ఒకవైపు అమ్మాయిగా, మరోవైపు అబ్బాయిగా కనిపిస్తూ బ్లాక్ బాస్ట‌రే సాంగ్‌కి డ్యాన్స్ చేశాడు. కాసేపు జరిగే ఈ టాస్క్ కోసం సరికొత్త గెటప్‌లో కనిపించడానికి సగం మీసం తీసేసిన రవి డెడికేషన్‌కు జడ్జ్‌లతో పాటు హౌస్‌మేట్స్ అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారు.
 
అలీ స్వింగ్‌జ‌రా పాట‌తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి వచ్చి తడిచిన బాడీతో హీటెక్కించాడు. దీంతో ఫిదా అయిన శ్రీముఖీ ఫిజ్ బాటిల్స్ అన్నీ ఇచ్చేసింది. అయితే అలీ వాటిని తిరిగి జ‌డ్జ‌స్ టేబుల్ మీద పెట్టేసి, బాబా ఇచ్చిన ఆపిల్‌ఫిజ్‌ని దించ‌కుండా తాగేసాడు.
 
వితిక కళ్లు లేని అమ్మాయిగా ఓ నాటకం వేసింది. కళ్లు దానం చేయండి అంటూ మెసేజ్ ఇస్తూ ఆమె ఇచ్చిన ప్రదర్శనకు ఇంటి సభ్యులంతా కళ్లనీళ్లపర్యంతమయ్యారు. ఇక శివజ్యోతి ఏదో మ్యాజిక్ చేస్తానని చెప్పి కాసేపు కామెడీ చేసింది. హిమజ.. ఓ సక్కనోడా అంటూ పాట పాడింది. మహేశ్ విట్టా తనలోని బాధను ఒక కథ రూపంలో చెప్పడంతో పాటు ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. ఇక, వరుణ్ సందేశ్ కూడా ‘ఉండిపోరాదే' పాట పాడి అందరినీ మంత్రముగ్ధులను చేయడంతో అతడికి ఫిజ్ బాటిల్ వచ్చింది.
 
మరి సింగర్ రాహుల్ ఇకపై ఏ ట్కాస్‌లో అయినా వంద శాతం ఎఫర్ట్ పెడతానని చెప్పి, ఈ టాస్క్‌లో తడబడ్డాడు. ఏమైపోయావే పాట స్టార్ట్ చేసి, రెండుసార్లు ఆగిపోతాడు. ఇక నేను పాడ‌లేను అని అనడంతో హౌస్‌మోట్స్ అంతా ఎంకరేజ్ చేయగా, శ్రీముఖి నువ్వో సింగ‌ర్ అయ్యి ఉండి, పాట పాడ‌క‌పోతే ప‌రువు పోతుంది అంటుంది. ఇక ఆ తర్వాత మరోసారి ప్రిపేర్ అయి పాటను ముగించాడు. దీంతో అతడికి కూడా ఫిజ్ బాటిల్ ఇచ్చింది శ్రీముఖి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments