బన్నీతో మరోసారి చిందేయనున్న చందమామ?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (13:21 IST)
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్.. అనే స్పెషల్ సాంగ్‌లో ఊర మాస్ స్టెప్పులు వేసి అభిమానుల్ని ఫిదా చేసింది. తాజాగా ఆమె మరో ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురంలో. 
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను కుటుంబ అనుబంధాలు, అప్యాయతల కలబోతగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కథకు తగ్గట్టు ఓ స్పెషల్ సాంగ్‌ని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పాటలో కాజల్ ఆడిపాడనుందని చెబుతున్నారు. సినిమాలో కథకు తగ్గట్టు సందర్భానుసారం ఈ పాట రావడం వల్ల ఈ ఐటెంసాంగ్‌లో నర్తించడానికి కాజల్ అంగీకరించినట్లు సమాచారం. 
 
త్వరలో ఈ పాటను అల్లు అర్జున్, కాజల్‌లపై భారీ హంగులతో తెరకెక్కించనున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments