Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ‌న్నీ, సుక్కు మూవీకి ముహుర్తం కుదిరింది... ఎప్పుడో తెలుసా..?

Advertiesment
Sukumar movie
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. దానికి కార‌ణం.. స‌రైన క‌థ‌తో సినిమా చేయాల‌నే. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్ కనపడుటలేదు` అనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
ఇలా వ‌రుస‌గా సినిమాలు ఓకే చెబుతున్నాడు కానీ... వరుస సినిమాలను ఎప్పటికీ పూర్తి చేస్తారోనని వార్తలు కూడా వినిపించాయి. అయితే... లేటెస్ట్‌గా బ‌న్నీ సుకుమార్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని... ముహుర్తం కూడా పెట్టేసార‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ముహుర్తం ఎప్పుడంటే... సెప్టెంబర్ 18న ప్రారంభం అవుతుందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుందట. మ‌రి.. ఈ సినిమాతో ఆశించిన విజ‌యం సాధిస్తాడో లేడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌భాస్‌కి పెళ్లి కుదిరిందా..? ఇంత‌కీ.. పెళ్లి కూతురు ఎవ‌రు..?