''ప్యారిస్ ప్యారిస్'' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ''క్వీన్'' సినిమాకు రీమేక్.
దక్షిణాదిలో నాలుగు భాషల్లో నలుగురు డిఫరెంట్ హీరోయిన్స్‌తో ''క్వీన్'' సినిమాను రీమేక్ చేసారు. ఇక తెలుగులో ప్యారిస్ ప్యారిస్ సినిమా రీమేక్‌లో కాజల్ అగర్వాల్ నటించింది. అయితే ఈ సినిమా విడుదల గురించి కాజల్ అగర్వాల్‌ను అడిగితే అంటీ అంటకుండా బదులిచ్చిందట.
ఈ సినిమా విడుదల గురించి అడిగితే.. అది తన పని కాదని చెప్పిందట. నటించడం వరకే తన పని అని ఇక దాని విడుదల అంతా యూనిట్ చేయాల్సి వుంటుందని చెప్పుకొచ్చింది. కన్నడ నటుడు రమేష్ అరవింద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావడంతో విడుదల చేద్దామని నిర్మాతలు ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. మిగతా మూడు భాషల్లో ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేకున్నా.. తమిళంలో మాత్రం సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఏకంగా 25 కట్స్ చెప్పారు. అడల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో సెన్సార్ వాళ్లు కొంచెం సీరియస్ అయ్యారు. సో సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ సినిమా విడుదలకు మార్గం సుగుమం అవుతుందని సినీ యూనిట్ చెప్తోంది. మరి సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు పచ్చజెండా ఊపుతుందో లేదో వేచి చూడాలి.