ఆ హీరో పెళ్లి ఆగిపోయినట్టేనా... మనస్పర్థలే కారణమా?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (12:42 IST)
కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన విశాల్ హీరోగా, ప్రొడ్సూసర్‌గా కొనసాగుతూనే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు చేపట్టారు. ఆయనకు హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో పెళ్లి ఫిక్స్ అయ్యి, మార్చి 10న ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.
 
పెళ్లి డేటుపై వారేమీ స్పందించకపోయినప్పటికీ అక్టోబర్ 9న వీరి పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇటీవల విశాల్-అనిషా తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి షాకింగ్ న్యూస్ బయటకి రావడంతో దీని గురించి అన్నిచోట్లా చర్చ జరుగుతోంది.

ముందుగా వీరి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టింది అనీషానే, 2018లో తన సోషల్ మీడియా పేజీలో ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేయగా, ఆపై హీరో విశాల్ తన అభిమానులకు వెల్లడించాడు. ఇక అనీషా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో పాటు నిశ్చితార్థం ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి ఆ ఫోటోలన్నీ తొలగించింది.
 
విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు రావడంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నట్లు, అందుకే ఫోటోలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే విశాల్ లేదా అనీషా ఎవరో ఒకరు స్పందించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments