మెగా కాంపౌండ్‌లో పెళ్లి భాజాలు... ప్రముఖ పారిశ్రామికవేత్తతో సంప్రదింపులు

మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:45 IST)
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి సందడి నెలకొనబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త సినిమా పరిశ్రమతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తోంది.


మరి పెళ్లి నిహారికకా లేక వరుణ్ తేజ్‌కా అనే వివరాలలోకి వెళ్లే...గతంలో నిహారిక పెళ్లి పుకార్లపై స్పందిస్తూ తాను సినిమాలలో సెటిల్ అయ్యేంత వరకు సమయం కావాలని, అప్పటి వరకు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే నిహారిక తెలుగులో చేసిన ‘ఒక మనసు', ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలు ఆమెకు హిట్ అందించలేకపోవడంతో సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇటీవల నాగబాబు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను పెళ్లి విషయంగా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిహారిక కోసం కాదు, వరుణ్ తేజ్ కోసం అని తెలిసింది. నిహారిక కొంత సమయం కోరడంతో నాగబాబు ముందు వరుణ్‌కు పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

దీనికి తోడు గతంలో మీడియా ఎప్పుడైనా పెళ్లి గురించి వరుణ్ అడిగితే ‘నా పెళ్లికి ఇంకా టైముంది. ప్రభాస్, నితిన్‌ ఇలా చాలా మంది సీనియర్ హీరోలు ఉన్నారు కదా..వాళ్లకు పెళ్లయ్యాక నేను చేసుకుంటా' అని సమాధానం చెప్పేవాడు. కానీ, ‘కొద్దిరోజుల క్రితం ‘F2' చేసిన తర్వాత నా మైండ్‌సెట్ మారింది.

మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్న నేనే నా అభిప్రాయాన్ని మార్చుకున్నా' అని వ్యాఖ్యానించడంతో ఈ విషయానికి మరింత బలం చేకూరింది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని హాట్ టాపిక్ నడుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చరిత్ర మనతోనే మొదలవ్వాలి : సైరా టీజర్ రిలీజ్