Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ సందేశ్‌కి షాకిచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్ నుంచి సర్వర్‌గా మారాల్సిందే

Advertiesment
వరుణ్ సందేశ్‌కి షాకిచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్ నుంచి సర్వర్‌గా మారాల్సిందే
, ఆదివారం, 11 ఆగస్టు 2019 (18:03 IST)
బిగ్ బాస్ హీరో వరుణ్ తేజ్‌కు షాకిచ్చారు. హౌస్ తొలి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని బిగ్ బాస్ అన్నారు. హౌస్ ఎవరు రూల్స్ పాటించకపోయినా పట్టించుకోవాల్సిన కెప్టెన్ పట్టించుకోలేదని.. దీనికి శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మార్చారు.


ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. 
 
ఇకపోతే.. ఇంటిలోని నియమ నిబంధనలను పాటించకుండా తప్పులు చేసిన సభ్యులందరికీ బిగ్ బాస్ శిక్ష వేశారు. అలీ, శ్రీముఖి, అశురెడ్డి, బాబా భాస్కర్, తమన్నా, రోహిణి, శివజ్యోతి, మహేష్ విట్టలకు బిగ్ బాస్ శిక్ష విధించారు. గార్డెన్ ఏరియాలో రెండు వాటర్ డ్రమ్ములను పెట్టారు. వాటికి కన్నాలున్నాయి. ఆ రంధ్రాల నుంచి నీళ్లు వెలుపలికి వస్తున్నాయి.
 
ఆ వాటర్‌ను అడ్డుపెట్టాలన్నారు. ఈ సమయంలో ఇంటి నియమ నిబంధనలన్నింటినీ పాటించాలి. ఎలాంటి తప్పుచేసినా శిక్ష అనుభవిస్తోన్న మిగిలిన సభ్యులు పూల్‌లోకి దూకి మునక వేయాలి. ఇలా ఎన్నిసార్లు తప్పుచేసినా అన్నిసార్లు మునక వేయాలి. తప్పులు జరిగాయి.. మునకలు వేయడం కూడా జరిగింది. మొత్తానికి ఇంటి సభ్యులను క్షమించిన బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసే సమయానికి వాళ్లను శిక్ష నుంచి విముక్తుల్ని చేశారు. 
 
బిగ్ బాస్ చెప్పినవన్నీ శుక్రవారం నాటి 20వ ఎపిసోడ్‌‌లో ఇంటి సభ్యులు తీసుకెళ్లి స్టోర్ రూంలో పెట్టేశారు. మ్యాట్రిసెస్, గుడ్లు, పాలు, పెరుగు, చెప్పులు, షూస్ అన్నీ ప్యాక్ చేసేసి స్టోర్ రూంలో పెట్టారు. వీళ్లు వీటన్నిటినీ స్టోర్ రూంలో పెడుతుంటే సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవి ఎంజాయ్ చేశారు.

వీళ్లు ఇద్దరు కనిపించకపోవడంతో కొంత మంది ఇంటి సభ్యులు కంగారు పడ్డారు. ఆ తరవాత లైట్ తీసుకున్నారు. అయితే, వీరిద్దరూ మళ్లీ ఇంటిలోకి రావాలని కోరుకుంటున్న కంటెస్టెంట్స్ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ సూచించారు
 
సీక్రెట్ రూంలో నుంచి అలీ, పునర్నవి బయటికి రాగానే... ఆ సీక్రెట్ రూంని కూడా ఇంటితో కలిపేశారు బిగ్ బాస్. అలీ, పునర్నవి సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తిచేశారని, వాళ్లు వచ్చేవారం నామినేషన్లలో ఉండరని బిగ్ బాస్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#RecordBreakingSaahoTrailer.. ఇక ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తా!