TamannaBiggBoss3.. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని.(video)

మంగళవారం, 30 జులై 2019 (12:28 IST)
తమన్నా సింహాద్రి ఎవరనేది ఇప్పుడు అందరికీ బాగా తెలుసు. హేమ తొలివారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడంతో ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కాగా తమన్నా సింహాద్రి కృష్ణ జిల్లా అవని గడ్డ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. 
 
తమన్నా తండ్రి సింహాద్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తారు. చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద తనను తాను చూసుకోవాలి ఆశపడే తమన్నాకు బ్యూటీ, డాన్స్, యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. అందుకే ఇంట్లోనే వుండటం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చింది.
 
గతంలో శ్రీడ్డి కాస్టింగ్ కౌచ్ గొడవ సమయంలో హాట్ టాపిక్‌ కావడంతో పాటు, ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి... బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె సినిమా అవకాశాలు రాకపోవడంతో ముంబై వెళ్లిపోయింది. అక్కడ జాబ్ చేసుకుంటూ వి కేర్ కంపెనీ వారు ఫ్యాషన్ షో పెడితే వెళ్లడం జరిగిందని.. అక్కడ తనకే ఫస్ట్ ప్లేస్ వచ్చిందని చెప్పింది.
 
ఎన్ని రోజులు ఇతర రాష్ట్రంలో ఉండటం.. మన సొంతం రాష్ట్రంలో ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను. అలా హైదరాబాద్ తిరిగి వచ్చాను. ఆ సమయంలోనే శ్రీరెడ్డి పరిచయం అవ్వడం, తన ఉద్యమంలో నేనూ చేరడం జరిగింది. తెలుగు అమ్మాయికి అండగా ఉండాలని ఆమెకు సపోర్ట్ చేశాను. అయితే అది అబద్దమైన పోరాటం అని తెలిసి, డబ్బుకు అమ్ముడైపోతున్న వ్యక్తి అని తెలియడంతో అందులో నుంచి బయటకు వచ్చినట్లు తమన్నా వెల్లడించారు. ఆపై ఇతర రాష్ట్రంలో వుండలేక సొంత రాష్ట్రానికి వచ్చేసింది. 
 
వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు తమన్నా వీరాభిమాని. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బహుశా ఈ విషయంలో శ్రీరెడ్డికి, తమన్నాకు మధ్య విభేదాలు వచ్చాయి. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వచ్చాయి. జనసేన నుంచి మంగళగిరిలో పోటీకి దిగాలని చూసింది. కానీ, వామపక్షాలతో పొత్తులో భాగంగా మంగళగిరి సీటును పవన్ కమ్యూనిస్టులకు ఇచ్చేశారు. 
 
దీంతో తమన్నా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగింది. అప్పటి మంత్రి నారా లోకేశ్‌పై తమన్నా పోటీకి దిగడంతో మీడియా బాగా ప్రచారం చేసింది. లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ అంటూ తమన్నాను ఆకాశానికి ఎత్తేసింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే తమన్నాకు 50 ఓట్లు కూడా రాలేదు. ఎమ్మెల్యేగా పోటీచేసిన తమన్నాకు ఓట్లు రాకపోయినా ప్రచారం మాత్రం బాగా వచ్చింది. ఇంకా చిరుతో స్టెప్పులేయడం తన కోరిక అని తమన్నా చెప్పుకొచ్చింది. 
 
ఆ ప్రచారం ఇప్పుడు కలిసొచ్చింది. ఈ క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం ఇచ్చారు. మరి ఈ అవకాశాన్ని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగార్జునపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో లేకుంటే వెధవ